యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-02T06:09:18+05:30 IST

జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని, కొవిడ్‌ అను భవాల దృష్ట్యా ఒమిక్రాన్‌ వేరియెంట్‌పై అప్రమత్తంగా ఉండాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు కలెక్టర్లను ఆదేశించారు.

యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి
హాజరైన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అధికారులు

- ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలి

-  పురపాలక, ఐటీ శాఖ మంత్రి   కే తారకరామారావు 

సిరిసిల్ల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని, కొవిడ్‌ అను భవాల దృష్ట్యా ఒమిక్రాన్‌ వేరియెంట్‌పై అప్రమత్తంగా ఉండాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైద రాబాద్‌ నుంచి రాష్ట్ర కేబినెట్‌ సబ్‌ కమిటీ మంత్రులు హరీష్‌రావు, సబితాఇంద్రారెడ్డి, కే తారకరామారావు వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయ ంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, డీపీవో రవీందర్‌, డీఈవో రాధాకిషన్‌, మున్సిపల్‌ కమిషనర్‌లు సమ్మయ్య, శ్యాంసుందర్‌రావు, డాక్టర్లు మహేష్‌, మీనాక్షి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. జిల్లాల వారీగా వ్యాక్సినేషన్‌ పురోగతి, సబ్‌ సెంటర్‌ల నిర్మాణం, ఏరియా ఆస్పత్రుల విస్తరణ, ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు, వ్యాక్సినేషన్‌పై సమీక్షిం చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సామాజిక మాద్యమాల్లో పుకార్లు ప్రచారం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అసత్య ప్రచారా లను, ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కరోనా చికిత్స కోసం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ప్రతీ జిల్లాలో బులెటిన్‌ విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఒమిక్రాన్‌ గురించి వస్తున్న సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 2.77 కోట్ల జనాభాకు 2.49 కోట్ల మందికి మొదటి డోసు,  1.28 కోట్ల మందికి  రెండో డోసు వేసినట్లు చెప్పారు.  25 లక్షల 48 వేల 369 మంది సెకండ్‌ డోసు కాలపరిమితి పూర్తయిన వారు ఉన్నారని, వారికి వెంటనే వ్యాక్సిన్‌ చేయాలని అన్నారు. ఒమిక్రాన్‌ వ్యాప్తిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో రెండు రోజులు ప్రత్యేక వ్యాక్సినేషన్‌ శిబిరాలు నిర్వహించాలని, 18 సంవత్సరాలు పైబడిన వారికి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని సూచించారు. 

Updated Date - 2021-12-02T06:09:18+05:30 IST