వ్యాక్సినేషన్‌ పాట్లు

ABN , First Publish Date - 2021-05-09T06:04:12+05:30 IST

కోవ్యాక్సిన్‌ కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాం. మొదటి డోసు వేసుకుని సమయం పూర్తవుతున్నప్పటికి రెండో డోసు వేసుకోవడానికి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వాపోతున్నారు.

వ్యాక్సినేషన్‌ పాట్లు
తణుకులో బారులు తీరిన ప్రజలు

 ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు

తణుకు, మే 8 : కోవ్యాక్సిన్‌ కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాం. మొదటి డోసు వేసుకుని సమయం  పూర్తవుతున్నప్పటికి రెండో డోసు వేసుకోవడానికి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఓవైపు వ్యాక్సినేషన్‌కు రావాలని టోకెన్‌లు రాసిస్తు న్నా వ్యాక్సిన్‌ దొరకడం లేదు. వ్యాక్సిన్‌  వేయడం మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే అయిపోతుంది. గంటలు తరబడి క్యూలైన్‌లో ఉన్నవారికి నిరాశ తప్పడం లేదు. ఎపుడు వ్యాక్సిన్‌ వచ్చినా నిరాశతోనే వెనుదిరగాల్సివస్తుందని వాపోతున్నారు. శనివారం ఉదయం కోవ్యాక్సిన్‌ 600 డోసులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వాటిలో వంద డోసులు మునిసిపల్‌ కార్యాలయం సమీపంలో నెంబర్‌–1 స్కూలులో వేస్తారని తెలిసి  ఆరు గంటలకే వందలాది మంది క్యూ కట్టారు.  తీరా వ్యాక్సిన్‌వేసే సరికి బాలుర ఉన్నత  పాఠశాలకు మారిపోయింది. ఒక పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారని.. ఎక్కడ వ్యాక్సిన్‌ వేస్తున్నారో తెలియడం లేదని పట్టణానికి చెందిన పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రైవేట్‌ ఆసుపత్రికి అవకా శమిస్తే వేయించుకునేవారమని తణుకుకు చెందిన నాగరాజు అన్నారు. వ్యాక్సిన్‌ కోసం రోడ్లపై గంటలు తరబడి నిలబడేలా చేయడం సరి కాదన్నారు.  ఇప్పటికైనా  ప్రభుత్వం అవసరమైనన్ని డోసులు సరఫరా చేసి పూర్తిగా రెండో డోసు వారికి టీకాలు వేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-05-09T06:04:12+05:30 IST