సంగారెడ్డి: జిల్లాలోని అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో కొవిడ్ వ్యాక్సినేషన్ సిబ్బంది నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎండీ సాబేరా(60) అనే వృద్ధురాలికి రెండు డోసుల కోవిడ్ టీకాను ఒకేసారి ఇచ్చారు. అనంతరం తమ తప్పు తెలుసుకుని బాధితురాలిని వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు.