Abn logo
Sep 22 2021 @ 00:51AM

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరం చేయాలి

వైద్య సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

కోనరావుపేట, సెప్టెంబరు 21 : కొవిడ్‌ వ్యాక్సి నేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేయాలని, క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. మండలం లోని కొండాపూర్‌, నిజామాబాద్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌లను మంగళవారం పరిశీలించారు. వైద్య సిబ్బందికి సూచనలిచ్చారు. నిర్దేశించిన గడువు లోగా జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌  పూర్తి చేయాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ వేసుకోని వారికి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్‌ ఇవ్వాలని వైద్య సిబ్బందిని కలెక్టర్‌ ఆదేశించారు.  జిల్లా వైద్యా ధికారి సుమన్‌మోహన్‌రావు, మండల వైద్యాధికారి మోహనకృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్‌లు మల్యాల దేవయ్య, కేతిరెడ్డి అరుణ జగన్‌మోహన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వంగపల్లి సుమలత, ఎంపీవో మీర్జ, ఏపీఎం దేవరాజు తదితరులు ఉన్నారు.

అర్హులందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి 

ఇల్లంతకుంట : అర్హులైన వారందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు. మండలంలోని కందికట్కూర్‌లో వ్యాక్సినేషన్‌ను తీరును మంగళవారం పరిశీలించారు.  పెద్దలింగాపూర్‌లో ఇంటింటికి తిరిగి  వ్యాక్సిన్‌ వేశారు.  వైద్యాధికారి సుభాషిణి, సర్పంచ్‌ గొడిశెల జితేందర్‌గౌడ్‌, ఎంపీటీసీ కరివెద స్వప్నకర్ణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముస్తాబాద్‌ : మండలంలోని తుర్కపల్లెలో 90 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని సర్పంచ్‌ కాశోల్ల పద్మదుర్గాప్రసాద్‌ తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను మంగళ వారం పరిశీలించారు. కరోనా రాకుండా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు.  హెల్త్‌ సూపర్‌వైజర్‌ అనసూయ, ఏపీఎం జయసుధ, కార్యదర్శి శ్రీకాంత్‌, వీఏవో జమున పాల్గొన్నారు. 

రుద్రంగి : మండల కేంద్రంలో మంగళవారం వైద్యసిబ్బంది ఇంటింటి తిరుగుతూ కరోనా వ్యాక్సిన్‌ వెేశారు.  రామకిష్టాపూర్‌ పల్లె వ్యాక్సిన్‌ తీసుకోని వారికి టీకా వేశారు. ఏఎన్‌ఎమ్‌ విజయ పాల్గొన్నారు.