చంటిబిడ్డతో ఎడారిలో నడుస్తూ...!

ABN , First Publish Date - 2021-10-25T07:07:28+05:30 IST

వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ మహత్తర కార్యం వెనక ఎంతోమంది ఆరోగ్యకార్యకర్తల కృషి ఉంది.

చంటిబిడ్డతో ఎడారిలో నడుస్తూ...!

స్ఫూర్తి

వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ మహత్తర కార్యం వెనక ఎంతోమంది ఆరోగ్యకార్యకర్తల కృషి ఉంది. రవాణా సదుపాయాలు లేని మారుమూల గ్రామాల్లో కూడా వ్యాక్సినేషన్‌ అందించడం వెనక వాళ్లు కీలకపాత్ర పోషించారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో ఏఎన్‌ఎమ్‌గా పనిచేస్తున్న అనిత ఎడారిలో రోజూ కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ క్రమంలో ఆమె ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. 9 నెలల చంటిబిడ్డ ఉన్నా ఆమె తన ఉద్యోగ బాధ్యతలను వీడలేదు. చంటిబిడ్డను వెంట తీసుకెళ్లి అప్పగించిన పని పూర్తి చేసింది. ‘‘కొన్ని  గ్రామాలకు చేరుకోవాలంటే ఎడారిలో నడుచుకుంటూ వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అయినా నేను వెనకంజ వేయలేదు. నేను అక్కడికి వెళ్లాక వ్యాక్సిన్‌ వేసుకోవడానికి జనం ముందుకొచ్చే వారు కాదు. అప్పుడు వాళ్లకు అవగాహన కల్పించే దాన్ని. వ్యాక్సిన్‌ ఆవశ్యకతను వివరించే దాన్ని. అలా ఇక్కడి గ్రామాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్‌ను సాధించా’’ అని తన అనుభవాలను పంచుకుంటారు అనిత. మారుమూల గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ కోసం ఎడారిలో నడుచుకుంటూ వెళ్లిన అనితపై సోషల్‌ మీడియా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-10-25T07:07:28+05:30 IST