వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-18T05:30:00+05:30 IST

జిల్లాలో నూరుశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని, జిల్లా వైద్యాధికారి కోటాచలం అన్నా రు.

వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలి
మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి కోటాచలం

జిల్లా వైద్యాధికారి కోటాచలం

మేళ్లచెర్వు, జనవరి 18: జిల్లాలో నూరుశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని, జిల్లా వైద్యాధికారి కోటాచలం అన్నా రు. మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలను ఆయన మం గళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అపోహలు వీడి ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి డోసు 98 శాతం, రెండో డోసు 76శాతం పూర్తయిందన్నారు. రెండో డోసు, బూస్టర్‌ డోసుకు అర్హులైన వా రందరికీ సమాచారం ఇచ్చి సకాలంలో టీకా వేయాలని సిబ్బందికి సూచించా రు.నూరుశాతం వ్యాక్సినేషన్‌కు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నా రు. కరోనా మూడో ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉంచామన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో నిరంజన్‌, పాపిరెడ్డి, అంజయ్య, కిరణ్‌కుమార్‌, పీహెచ్‌ఎన్‌ పద్మ,లక్ష్మి ఉన్నారు.  

Updated Date - 2022-01-18T05:30:00+05:30 IST