రేపటి నుంచి 11శాఖలకు వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-06-13T04:43:26+05:30 IST

జిల్లాలోని 11 శాఖలకు సోమవారం నుంచి బుధ వారం వరకు మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ వేయనున్నట్లు కలెక్టర్‌ శరత్‌ తెలిపారు.

రేపటి నుంచి 11శాఖలకు వ్యాక్సినేషన్‌
అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి టౌన్‌, జూన్‌ 12: జిల్లాలోని 11 శాఖలకు సోమవారం నుంచి బుధ వారం వరకు మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ వేయనున్నట్లు కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎక్సైజ్‌, ట్రాన్స్‌కో, ఐకేపీ, వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌, పోస్టల్‌, పంచా యతీరాజ్‌, నీటి పారుదల, హౌజింగ్‌ ఇంజనీరింగ్‌, సబ్‌ రిజిస్ట్రేషన్‌, గ్రామ పంచా యతీ సర్పంచ్‌, పాలకవర్గం, కార్యదర్శులకు, మార్కెట్‌ కమిటీల సిబ్బంది, డయాల సిస్‌, 18సంవత్సరాలు పైబడిన తలసేమియా వ్యాధిగ్రస్తులకు వ్యాక్సినేషన్‌ చేయా లని వైద్య అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకట మాధ వరావు, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
కొత్త కలెక్టరేట్‌లో పనులు వేగవంతం చేయాలి
కొత్త కలెక్టర్‌లో పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. శనివారం నూతన కలెక్టరేట్‌లో జరుగుతున్న పనులను పరిశీలిం చారు. బాదం, నేరేడు, మామిడి, మేడి, జువ్వి, మహగని వంటి మొక్కలను నాటాలని సూచించారు.

నూతన డీఎఫ్‌వోగా నిఖిత బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఫారెస్ట్‌ అధికారిగా నిఖిత బాధ్యతలు స్వీకరించా రు. శనివారం మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ శరత్‌ను కలిసి మొక్కను అందజేశారు. గతంలో ములుగు జిల్లాలో ఎఫ్‌డీవోగా పని చేసి బదిలీపై కామారెడ్డి జిల్లాకు వచ్చారు.

Updated Date - 2021-06-13T04:43:26+05:30 IST