నేటి నుంచి టీకా పండుగ

ABN , First Publish Date - 2021-04-11T11:59:45+05:30 IST

కమ్ముకొస్తున్న కరోనాను అడ్డుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీకాపై అవగాహన, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన చేపట్టేందుకు మూడురోజుల పాటు ‘టీకా ఉత్సవ్‌’ నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారు. అందులో భాగంగా ఆదివారం నుంచి

నేటి నుంచి టీకా పండుగ

మూడు రోజులు భారీగా వ్యాక్సినేషన  

రోజుకు 30వేల టీకాలు వేయడమే లక్ష్యం

సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన

కడప, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): కమ్ముకొస్తున్న కరోనాను అడ్డుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీకాపై అవగాహన, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన చేపట్టేందుకు మూడురోజుల పాటు ‘టీకా ఉత్సవ్‌’ నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారు. అందులో భాగంగా ఆదివారం నుంచి మూడురోజుల పాటు జిల్లాలో టీకా పండుగ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సర్వం సిద్ధం చేసింది. 45 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే ఉండే టీకా కేంద్రాలతో పాటు సచివాలయాలల్లో కూడా టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 45 సంవత్సరాలు పైబడ్డ వారు 7.50 లక్షల మంది ఉన్నారు. కరోనా నియంత్రణలో ముందున్న ఉద్యోగులకు టీకా పంపిణీని జనవరి 16న ప్రారంభించారు. తరువాత 45 ఏళ్లు దాటి, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి కూడా టీకా వేస్తూ వచ్చారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పూర్తయిన అందరికీ టీకా వేయాలని కేంద్రం సూచించింది. ఇప్పటివరకు జిల్లాలో 2.11 లక్షల మందికి టీకా వేశారు. మరో 5.80 లక్షల మందికి టీకా వేయాల్సి ఉంది. టీకా పండుగలో భాగంగా వ్యాక్సినేషన వేగవంతం చేసేందుకు గాను 11, 12, 13 తేదీల్లో టీకా ఉత్సవం నిర్వహిస్తున్నారు. జిల్లాలో రోజూ 30వేల మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు రిమ్స్‌, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 74 చోట్ల, మరో 21 ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారు. అయితే టీకా ఉత్సవంలో భాగంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో కూడా టీకాలు వేయనున్నారు. రోజుకొక వార్డు, గ్రామ సచివాలయాల్లో టీకా వేస్తారు. తొలిరోజు ఆదివారం 298 గ్రామ సచివాలయాలు, 68 వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లాను రెండు రూట్లుగా విభజించి 12 మంది ప్రోగ్రాం అధికారులను నియమించారు.


టీకా సురక్షితం

కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. జిల్లాలో శుక్రవారం 175 కేసులు నమోదైతే శనివారం 124 కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేయాలంటే టీకా తప్పనిసరి. 45 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ అపోహలు, భయాందోళనలకు గురి కాకుండా టీకా వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జిల్లాలో రెగ్యులర్‌గా ఇచ్చే వ్యాక్సినేషన కేంద్రాలతో పాటు అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో రొజుకొక చోట వ్యాక్సినేషన జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు వ్యాక్సిన సమాచారం కోసం ఏఎనఎం, ఆశావర్కరు, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం, డీఎంహెచవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మూడురోజులపాటు ప్రతి రోజూ ఎంపిక చేసిన సచివాలయాల్లో టీకా ఇస్తారన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన వేసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. వ్యాక్సినేషన అయ్యాక కూడా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం చేయాలని సూచించారు.

Updated Date - 2021-04-11T11:59:45+05:30 IST