నిరాటంకంగా Vaccination‌ drive

ABN , First Publish Date - 2021-11-15T18:11:59+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల ప్రత్యేక కేంద్రాలలో ఆదివారం ఉదయం ఎనిమిదో విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. స్థానిక విల్లివాక్కం పాత గంగా థియేటర్‌ సమీపం వాగ్మానగర్‌లో వ్యాక్సినేషన్‌ శిబిరా న్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

నిరాటంకంగా Vaccination‌ drive

ప్రారంభించిన సీఎం స్టాలిన్‌  

16.32 లక్షల మందికి టీకాలు

చెన్నై : రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల ప్రత్యేక కేంద్రాలలో ఆదివారం ఉదయం ఎనిమిదో విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. స్థానిక విల్లివాక్కం పాత గంగా థియేటర్‌ సమీపం వాగ్మానగర్‌లో వ్యాక్సినేషన్‌ శిబిరా న్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభిం చారు. ఆ సందర్భంగా టీకాలు వేసుకున్న వృద్దులను ఆప్యా యంగా పలకరించారు. రెండో విడత కరోనా నిరోధక టీకాలు వేసుకోనివారికి ఈ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ లో ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని అంటు వ్యాధుల నిరోధక వైద్యశిబిరాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా చిన్నారులకు విటమిన్‌ మాత్రలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. స్టాలిన్‌తో పాటు ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ, ఎంపీ దయానిధి మారన్‌ తది తరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


కార్పొరేషన్‌ వలసరవాక్కం జోన్‌లోని వానగరం మెయిన్‌రోడ్డు కన్నియమ్మన్‌నగర్‌లో ఏర్పాటైన టీకాల శిబిరాన్ని మంత్రి ఎం. సుబ్రమణ్యం, మదురవాయల్‌ శాసన సభ్యుడు కే గణపతి, కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ (ఆరోగ్యశాఖ) డాక్టర్‌ ఎస్‌ మనీష్‌ తదితరులు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, బస్టాపులు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు తదితర ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఆదివారం ఉదయం ఏడుగంటలకు టీకాలు వేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి ఏడువరకు ఈ కార్యక్రమాలు కొనసాగాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న కన్నియాకుమారి జిల్లా మినహా తక్కిన అన్ని జిల్లాలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిరాటంకంగా కొనసాగింది. నగరంలో వార్డుకు పది శిబిరాలు చొప్పున 200 వార్డులలో  రెండు వేల టీకా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 16.32 లక్షలమందికి టీకాలు వేసినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2021-11-15T18:11:59+05:30 IST