వ్యాక్సినేషన్ కోడ్...

ABN , First Publish Date - 2021-05-08T03:02:22+05:30 IST

కరోనా బెంబేలెత్తిస్తోన్న నేపధ్యంలో... వ్యాక్సిన్ వేయించుకునేందుకు డిమాండ్ కూడా పెరుగుతోంది. కాగా తాజాగా... వ్యాక్సిన్ వేయించుకోవాలంటే... నాలుగంకెల కోడ్ చెప్పాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది.

వ్యాక్సినేషన్ కోడ్...

న్యూఢిల్లీ : కరోనా బెంబేలెత్తిస్తోన్న నేపధ్యంలో... వ్యాక్సిన్ వేయించుకునేందుకు డిమాండ్ కూడా పెరుగుతోంది. కాగా తాజాగా... వ్యాక్సిన్ వేయించుకోవాలంటే... నాలుగంకెల కోడ్ చెప్పాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. అయితే... ఇది ‘కోవిన్’ యాప్‌లో బుక్ చేసుకుంటేనే సుమా. ఇందుకోసం ఓ కొత్త ఫీచర్‌ను చేర్చారు. వివరాలిలా ఉన్నాయి.


దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 16.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే... కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించే కోవిన్ పోర్టల్‌ భద్రతపై ఊహగానాలు మోదలయ్యాయి. ఈ పోర్టల్‌లో నమోదు చేసే సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయన్న ఆందోళన తలెత్తుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్‌ను అమల్లోకి తీసుకు వచ్చింది. దీనితో డేటా ఎంట్రీ పొరపాట్లు కూడా కనిష్ట స్థాయికి తగ్గుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. కోవిన్ కొత్త ఫీచర్ శనివారం(మే 8) నుంచి అమల్లోకి వస్తుందంటూ ప్రకటించింది. కాగా... కొత్త ఫీచర్‌లో నాలుగంకెల సెక్యూరిటీ కోడ్‌ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో... డేటా ఎంట్రీలో లోపాలు గణనీయంగా తగ్గిపోతాయని,  భద్రతాపరమైన లోపాలు కూడా ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది. కాగా ఈ నేపధ్యంలో... వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తి... తనకు సంబంధించిన నాలుగంకెల కోడ్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. ఆ కోడ్... కోవిన్ సిస్టమ్‌లో ఎంటర్ చేస్తారు. అది పరితూగితేనే వ్యాక్సినేషన్ జరుగుతుంది. 

Updated Date - 2021-05-08T03:02:22+05:30 IST