Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికా వెళ్లే విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌ !

అమెరికా వెళ్లే విద్యార్థుల‌కు టీకా స‌ర్టిఫికేట్ అవ‌స‌రం లేదు

అమెరికా వెళ్లే విద్యార్థులకు నెగటివ్‌ రిపోర్టు చాలు

న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రూఫ్‌ అవసరం లేదని, 72 గంటల ముందు తీసుకున్న కొవిడ్‌-19 నెగటివ్‌ రిపోర్ట్‌ మాత్రం అవసరం ఉంటుందని యూఎస్‌ రాయబార కార్యాలయం కాన్సులర్‌ వ్యవహారాల మంత్రి డాన్‌ హెఫ్లిన్‌ తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది అమెరికా వెళ్లేందుకు వీసాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వీసా అపాయింట్‌మెంట్లు పొందడంలో కొన్ని పరిమితుల దృష్ట్యా ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను సోమవారం నుంచే ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement