టీకా... 3వ విడతలోనూ.. స్పందన అంతంతే!

ABN , First Publish Date - 2021-03-02T09:24:25+05:30 IST

సోమవారం నుంచి మొదలైన మూడో విడత వ్యాక్సినేషన్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఈ విడతలో దాదాపు 90

టీకా... 3వ విడతలోనూ.. స్పందన అంతంతే!

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): సోమవారం నుంచి మొదలైన మూడో విడత వ్యాక్సినేషన్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఈ విడతలో దాదాపు 90 లక్షల మందికి టీకా వేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. తొలిరోజు 10వేల మందికి కూడా వేయలేకపోయారు. సోమవారం హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, సీనియర్‌ సిటిజన్స్‌ కలిపి 14,701 మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ జరిగింది. అందులోనూ హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లే అత్యధికంగా ఉన్నారు. 

Updated Date - 2021-03-02T09:24:25+05:30 IST