రేపు జిల్లాలో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-06-19T06:02:20+05:30 IST

వ్యాక్సినేషన్‌ వేసేందుకు జిల్లాలో ఆది వారం స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు

రేపు జిల్లాలో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

 ఒకే రోజు లక్ష మందికి వేయాలని లక్ష్యం

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

 ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 18: వ్యాక్సినేషన్‌ వేసేందుకు జిల్లాలో ఆది వారం స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు  కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. ఆరోజున లక్ష మందికి వ్యాక్సిన్‌(టీకా) వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం సాయం త్రం ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డీఏవోలు, సీడీపీవోలు, మునిసి పల్‌ కమిషనర్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఒక్క డోసుకూడా వేయిం చుకొని 45 ఏళ్లు పైబడిన వారితో పాటు ఐదేళ్ళలోపు చిన్నారులు ఉన్న తల్లులకు ఆదివారం వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వయస్సు వారికి కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు వ్యాక్సిన్‌వేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. వీడి యో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్లు టీఎస్‌ చేతన్‌, కె.కృష్ణవేణి, డీఎంహె చ్‌వో  డాక్టర్‌ రత్నావళి, డీసీహెచ్‌వో డాక్టర్‌ ఉషారాణి, వివిధ శాఖల అధి కారులు శీనారెడ్డి, లక్ష్మీదేవి, సుబ్బారావు, భాగ్యలక్ష్మి  పాల్గొన్నారు.

ఈ క్రాపింగ్‌ తప్పనిసరిగా చేయాలి

 ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలంటే ఈ క్రాపింగ్‌ ద్వారానే సాధ్యమని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్ట రేట్‌ నుంచి మండల వ్యవసాయ శాఖ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రై తులకు బహుళ ప్రయోజనాలు క ల్పించడానికి ఈ క్రాపింగ్‌ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్నా రు. జిల్లాలో 2.15 లక్షల  హెక్టార్లలో పంటల సాగు విస్తీర్ణమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. 

సత్వరమే వేతనాలు చెల్లించాలి

కొవిడ్‌ సమయంలో ప్రత్యేకంగా నియమించిన వైద్య సిబ్బంది వేతనాలు పెండింగ్‌ లేకుండాతక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కు మార్‌ ఆదేశించారు. కలెక్టర్‌ చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక నిబంధనల కింద భర్తీచేసిన వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి నిధుల కేటాయింపుతో పాటు వేతనాలు చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ భవనాలను సకాలంలో పూర్తిచేయాలి

ప్రభుత్వ భవనాల నిర్మాణాలు సకాలంలో పూర్తిచేసి అప్పగించడమే లక్ష్యంగా పక్షోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుందనికలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌ లో డ్వామా, పీఆర్‌ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం అను సంధానంతో మంజూరుచేసిన పనులు 15 రోజుల్లో పురోగతి కనిపించాల న్నారు. ప్రధానంగా పర్చూరు, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గా ల్లో పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు

Updated Date - 2021-06-19T06:02:20+05:30 IST