Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాక్సిన్‌తో రక్తం గడ్డలు

ఆంధ్రజ్యోతి(15-06-2021)

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి లాంటి స్వల్ప లక్షణాలు తలెత్తడం సహజం. వ్యాక్సిన్‌తో శరీరంలో యాంటీబాడీలు తయారవుతున్నాయనడానికి నిదర్శనమే ఈ లక్షణాలు. అయితే వ్యాక్సిన్‌తో శరీరంలోని వేర్వేరు ప్రదేశాల్లో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశాలూ ఉంటాయి. ఇవి రక్తప్రవాహంతో కలిసి, గుండెకు చేరుకుని, గుండెపోటును కలిగించవచ్చు. కాబట్టి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శా,ఖ వ్యాక్సిన్‌ వేయించుకున్న వ్యక్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడినట్టు సూచించే కొన్ని లక్షణాల గురించి సూచనలు ఇస్తోంది. ఆ లక్షణాలు ఏవంటే....


పల్మనరీ ఎంబాలిజం: రక్తపు గడ్డలతో తలెత్తే ప్రధానమైన థ్రాంబిక్‌ ఎటాక్‌... పల్మనరీ ఎంబాలిజం. రక్తపు గడ్డ ఊపిరితిత్తుల్లోకి చేరుకుని రక్తప్రవాహానికి అడ్డుపడడంతో సమస్య తలెత్తుతుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. శ్వాస అందకపోవడం, ఛాతోలో నొప్పి, దగ్గులో రక్తం పడడం లాంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.


కాళ్లు, చేతుల్లో: కాళ్లు, చేతుల్లో కూడా రక్తపు గడ్డలు ఏర్పడవచ్చు. హఠాత్తుగా కాళ్లు, చేతుల్లో నొప్పి మొదలైనా, వాచినా, చర్మం ఎర్రబడినా, రక్తాన్ని పోలిన చక్కలు చర్మం మీద ఏర్పడినా వెంటనే అప్రమత్తం కావాలి.


పొట్టలో నొప్పి: వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత పొట్టలో అసౌకర్యం తలెత్తితే జీర్ణసంబంధ సమస్య అని భావించకూడదు. పొట్టలో గుచ్చుతున్నట్టు నొప్పి ఉండి, తలతిరుగుతూ ఉంటే, పొట్టలో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని అర్థం. కాబట్టి వెంటనే వైద్యులను కలవాలి.


తలనొప్పి: మాట్లాడడంలో ఇబ్బంది, బలహీనత, చూపు మసకబారడం, తలనొప్పి మొదలైన లక్షణాలు మెదడులో ఏర్పడిన రక్తపు గడ్డలకు సూచనలు. కాబట్టి  వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను కలవాలి.


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...