వ్యాక్సినేషన ప్రక్రియ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-10-19T06:39:31+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు.

వ్యాక్సినేషన ప్రక్రియ వేగవంతం చేయాలి

కలెక్టర్‌ నాగలక్ష్మి 

అనంతపురం, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమ వారం ఆమె కలెక్టరేట్‌ నుంచి పలుశాఖల అధికారులతో  వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. వ్యాక్సినేషన ప్రక్రియ తోపాటు ఇళ్ల గ్రౌండింగ్‌, పట్టాల పంపిణీ, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీ, బయోమెట్రిక్‌ అటెండెన్స, ఉపాధి హామీ పనులు, సచివాలయ భవనాలు, రైతు భరోసా, వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల భవనాల పూర్తి, వైఎస్సార్‌ అర్బన క్లినిక్‌లు, వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ  18-44 ఏళ్లమధ్య ఉన్నవారికి మొదటి విడత వ్యాక్సినేషన చేయాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్‌లు, ఆర్డీఓలు, తహసీల్దార్ల పరిధిలో ఎంతమందికి వ్యాక్సినేషన ప్రక్రియ పూర్తిచేశారో ఆ వివరాలను సంబంధిత అధికారు లతో కలెక్టర్‌ ఆరాతీశారు.  పీహెచసీలు, సచివాలయాలు, సీహెచసీలు, ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో కేటాయించిన  లక్ష్యాలకు అనుగుణంగా వ్యాక్సినేషన చేపట్టాలన్నారు. ఇ ప్పటికే పెండింగ్‌ ఉన్న వ్యాక్సిన డోసులను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. వ్యాక్సినేషన సర్వే పక్కాగా చేప ట్టాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా ఇళ్ల గ్రౌండింగ్‌తోపాటు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తిచేయాలని ఆదే శించారు. భవనాల విషయంలోనూ ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కా ర్యక్రమంలో జేసీలు నిశాంతకుమార్‌, డాక్టర్‌ సిరి, నిశాంతి, సీపీఓ ప్రేమ్‌చంద్ర, పీఆర్‌ఎస్‌ఈ భాగ్యరాజ్‌, హౌసింగ్‌ పీడీ కేశవనాయుడు, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు వేణుగోపాల్‌రెడ్డి, నరసింహారెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T06:39:31+05:30 IST