వెకేషన్‌ కోర్టుల విచారణ తేదీలు ఖరారు

ABN , First Publish Date - 2021-05-09T08:59:30+05:30 IST

హైకోర్టుకు ఈ నెల 10 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్‌ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మొదటి దశ వెకేషన్‌ కోర్టులు ఈ నెల 14, 20, 27వ

వెకేషన్‌ కోర్టుల విచారణ తేదీలు ఖరారు

తొలిదశలో 14, 20, 27వ తేదీల్లో విచారణలు


అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): హైకోర్టుకు ఈ నెల 10 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్‌ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మొదటి దశ వెకేషన్‌ కోర్టులు ఈ నెల 14, 20, 27వ తేదీల్లో పని చేయనున్నాయి. 14, 20వ తేదీల్లో జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమర్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్య డివిజన్‌ బెంచ్‌గా, జస్టిస్‌ కె.సురేష్‌ రెడ్డి సింగిల్‌ జడ్జిగా విచారణ జరుపుతారు. 27వ తేదీ విచారణకు జస్టిస్‌ డి.రమేష్‌, జస్టిస్‌ కె.సురేష్‌ రెడ్డి డివిజన్‌ బెంచ్‌గా, జస్టిస్‌ ఎన్‌. జయసూర్య సింగిల్‌ బెంచ్‌గా విచారణ చేస్తారు. రెండోదశ వెకేషన్‌ కోర్టులు జూన్‌ 3, 10వ తేదీల్లో విచారణ జరుపుతాయి. జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ డి.రమేష్‌ డివిజన్‌ బెంచ్‌గా, జస్టిస్‌ ఎం.గంగారావు సింగిల్‌ బెంచ్‌లో విచారణ జరుపుతారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు.

Updated Date - 2021-05-09T08:59:30+05:30 IST