వెకేషన్‌ మోడ్‌!

ABN , First Publish Date - 2021-03-28T05:57:41+05:30 IST

సమయం దొరికితే చాలు సినీతారలు ప్రపంచంలోని చూడదగ్గ ప్రదే శాలను చుట్టొస్తుంటారు. ఆ విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు

వెకేషన్‌ మోడ్‌!

సమయం దొరికితే చాలు సినీతారలు ప్రపంచంలోని చూడదగ్గ ప్రదే శాలను చుట్టొస్తుంటారు. ఆ విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారికా ఇప్పుడు వర్క్‌ మోడ్‌  నుంచి వెకేషన్‌ మోడ్‌కు మారారు. లావణ్య, నిహారికా ఇద్దరూ మంచి స్నేహితులు. తమ స్నేహితులతో కలసి సరదాగా ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ కొండలు ఎక్కుతూ, జలపాతాల్లో ఈత కొడుతూ, రాత్రిళ్లు బోన్‌ఫైర్‌ రాజేసి సరదాగా గడిపారు. వీరితో పాటు నిహారిక భర్త చైతన్య జేవీ, దర్శకుడు ప్రణీత్‌ బ్రహ్మానందపల్లి మరికొందరు స్నేహితులు ఉన్నారు. అక్కడ సరదాగా గడుపుతూ దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా షేర్‌ చేయగా వైరలయ్యాయి.

Updated Date - 2021-03-28T05:57:41+05:30 IST