ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-08-09T05:59:01+05:30 IST

కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు నిజంగా దేశభక్తి ఉంటే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకావాలు కల్పించి దేశభక్తిని చాటుకోవాలని డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు జీ రామన్న కోరారు. స్థానిక డీవైఎ్‌ఫఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి న రేంద్రమోదీ దేశ ప్రజలందరి డీపీలు మార్చి దేశభక్తి చాటుకోవాలని చెప్తున్నారని, మార్చాలింది డీపీలు కాదని, దేశ జీడీపీని మార్చాలని అన్నారు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రామన్న

డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న డిమాండ్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 8 : కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు నిజంగా దేశభక్తి ఉంటే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకావాలు కల్పించి దేశభక్తిని చాటుకోవాలని డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు జీ రామన్న కోరారు. స్థానిక డీవైఎ్‌ఫఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి న రేంద్రమోదీ దేశ ప్రజలందరి డీపీలు మార్చి దేశభక్తి చాటుకోవాలని చెప్తున్నారని, మార్చాలింది డీపీలు కాదని, దేశ జీడీపీని మార్చాలని అన్నారు. ఈ విషయంలో మోదీ ముందుగా ఖాళీ పోస్టులను భర్తీ చేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు. దేశ సంపదను లూటీ చే స్తూ అంబానీ, ఆదానీలకు  దోచిపెడుతూ దేశానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నరేంద్రమోదీ దేశాన్ని, జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కేఎ్‌ఫబాబు, కేవీ పిచ్చయ్య, కిరణ్‌, రామయ్య తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2022-08-09T05:59:01+05:30 IST