Abn logo
Sep 23 2021 @ 00:56AM

టీయూలో ఖా‘లీలలు’!!


తెలంగాణ విశ్వవిద్యాలయంలో అనుమతులు లేకుండా పోస్టుల భర్తీ

అనుకూలమైన వారికే పోస్టింగ్‌లు

అవసరాల కోసం భర్తీ చేశామంటున్న అధికారులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో తాత్కలిక ఉద్యో గాల భర్తీకి ఈసీ అనుమతులు లేవు.. ఉన్నత విద్య అధికారుల నుంచి ఆదేశాలూ లేవు. తమకు ఇష్టం వచ్చిన రీతిలో అత్యవసరం పేరిట అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వారికి విధులను సైతం కేటాయిస్తున్నారు. టీయూలోని డిపార్ట్‌మెంట్‌లతో పాటు ఇతర శాఖల లో ఈ మధ్యనే అటెండర్లు, జూనియర్‌ అసిస్టెంట్‌లు, ఇతర పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తమకు అనుకూలమైన వారిని భర్తీ చేశారు. ఈ పోస్టుల భర్తీలో భారీగానే డబ్బులు కూడా వసూలు చేసినట్లు తెలుస్తోంది. టీయూ పరిధిలో తాత్కలికంతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీకీ ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. విశ్వవిద్యాలయం ఈసీలో పెట్టాలి. టీయూ ఎక్సిక్యూటివ్‌ సభ్యుల అనుమతులు, బడ్జెట్‌ కేటాయింపులకు తీసుకోవాలి. ఆ తర్వాతనే ఏజెన్సీల ద్వారా భర్తీ చేయాలి. విశ్వవిద్యాలయంలో పాలన పర అవసరాల కోసం నియమ కాలకు కూడా ఈ పద్ధతి తప్పనిసరి. ఒకసారి అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకున్న వారి ఆయా విభాగాలలో కేటాయింపులను చేస్తారు. విశ్వవిద్యాలయం అకాడమిక్‌ కన్సల్టెంట్లకు మాత్రం తప్పనిసరి నోటిపికేషన్‌ ఇవ్వాలి. అలాగే, దరాఖాస్తుల ను స్వీకరించాలి. ప్యానల్‌ మెంబర్లను నియమించాలి. వారి ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలి.

ఫ ఖాళీల భర్తీకి అనుమతి తప్పనిసరి

విశ్వవిద్యాలయంలో ఏ పోస్టు భర్తీ చేయాలన్నా అనుమతులు తప్పనిసరి తీసుకోవాలి. ఈ మధ్యనే విశ్వ విద్యాలయంలో అటెండర్లు, జూనియర్‌ అసిస్టెంట్లను 12 మందికి పైగా తీసుకున్నారు. మరి కొంతమందిని తీసుకునేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవే కాకుండా డ్రైవర్లు, కార్లను కూడా అవసరాల పేరునా అద్దెకు తీసుకున్నారు. వీసీతో పాటు ఇతర అధికారుల తనిఖీల కోసం ఉపయోగిస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తాత్కాలిక అవసరాల పేరుతో తీసుకున్న ఈ పోస్టులకు ప్రభుత్వ,  విశ్వవిద్యాలయ ఈసీ అను మతులు లేకపోవడం గమనార్హం. త్వరలో జరిగే సమావేశంలో అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో పరిధిలో అవుట్‌సోర్సింగ్‌ పోస్టులన్నీ ఇదే పద్ధతి లో మొదలయినప్పటి నుంచి భర్తీ చేస్తున్నారు. తర్వాత అనుమతులు తెచ్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల సిపారస్‌ల పేరు చెప్పి భర్తీ చేస్తున్నారు. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా తమకు దగ్గరగా ఉన్నవారిని భర్తీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో డబ్బు లు కూడా భారీగానే చేతులు మారుతున్నాయి. చివరకు సమావేశాలలో సరిపడా సిబ్బంది లేరని చెప్పి కొనసాగించడం కొసమెరుపు. అవసరాల పేరిట మూడేళ్ల క్రితం తీసుకున్న వారికి అనుమతులు ఇవ్వలేదు. ఈ పోస్టుల భర్తీ పై కూడా టీయూ అధికారులు సరైన కారణాలు చెప్పడం లేదు. నోటిపికేషన్ట ద్వారా తీసుకుంటే నిరుద్యోగులకు మేలు జరిగేది. 

ఫ ‘పని భారం.. సిబ్బంది కొరత వల్లే తీసుకున్నాం’

పని భారం.. సిబ్బంది కొరత వల్ల వీరిని తాత్కలికంగా తీసుకున్నామని రిజిస్ట్రార్‌ ప్రొ.కనక య్య తెలిపారు. వీరికి ఈసీ సమావేశంలో బడ్జెట్‌ అనుమతులు తీసుకుంటామని, అకాడమిక్‌ కన్సల్టెంట్లకు నోటిఫికేషన్‌ ఇస్తామని, ఈ పోస్టులకు అవసరం లేదని అన్నారు. విశ్వవిద్యాలయ అవసరాల కోసం అవుట్‌ సోర్సింగ్‌ ఏజేన్సీల ద్వారా వీరిని తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అన్ని విబాగాలలో సిబ్బంది కొరత ఉండడం వల్ల ఈ నియామాకం చేశామన్నారు.