భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవల్‌పమెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఉమెన్ అండ్ చైల్డ్ డెవల్‌పమెంట్ కోఆర్డినేటర్
అర్హత: సోషల్ సైన్సెస్/ మేనేజ్మెంట్/ హ్యుమానిటీస్/ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.90,000
డేటా అనలిస్ట్
అర్హత: సోషల్ సైన్సె్‌స/మేనేజ్మెంట్/స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.40,000
ప్రాజెక్ట్ అసోసియేట్
అర్హత: సోషల్ సైన్సెస్/ మేనేజ్మెంట్/ హ్యుమానిటీ్సలో ఎంఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.30,000
ఫైనాన్స్ అసోసియేట్
అర్హత: కామర్స్, కంప్యూటర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.30,000
ఆఫీస్ అసిస్టెంట్
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి
వయసు: 40 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.16,000
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 26
వెబ్సైట్: http://nirdpr.org.in/