Abn logo
Jun 3 2020 @ 10:04AM

నెటిజన్ అభ్యంతకర కామెంట్.. వాణి రియాక్షన్!

తన శరీరం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నెటిజన్‌కు బాలీవుడ్‌ హీరోయిన్ వాణీ కపూర్ సుతిమెత్తగా కౌంటర్ వేసింది. నెటిజన్ ఘాటుగానే విమర్శించినప్పటికీ వాణి మాత్రం సంయమనం కోల్పోకుండానే స్పందించింది. దీంతో నెటిజన్లు ఆమె సహనాన్ని ప్రశంసిస్తున్నారు. 


సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన వాణి.. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. ఈ సమయంలో ఓ నెటిజన్ వాణి శరీరం గురించి అసభ్యకరంగా కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన వాణి.. `మీకు హృదయం ఉంది. కాస్త మనసుతో ఆలోచించండి. అనవసరంగా ఎదుటివారిని ద్వేషించకండి` అని రిప్లై ఇచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement