తిరుమల తరహాలో...

ABN , First Publish Date - 2021-10-19T05:27:47+05:30 IST

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఆత్రేయపురం, అక్టోబరు 18: మండలంలోని వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో తొమ్మిది రోజుల పాటు అ

తిరుమల తరహాలో...
ముస్తాబైన వాహనాలు

ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు 

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

ఆత్రేయపురం, అక్టోబరు 18: మండలంలోని వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి  ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

Updated Date - 2021-10-19T05:27:47+05:30 IST