ఉత్తరప్రదేశ్‌లో తమిళం నేర్పిస్తారా?

ABN , First Publish Date - 2022-04-17T15:30:25+05:30 IST

హిందీ నిర్బంధం దేశ సమైక్యతకు వ్యతిరేకంగా పరిణమిస్తోందని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ డా.అన్బుమణి రాందాస్‌ అభిప్రాయపడ్డారు. నగరంలో శనివారం ఆయన

ఉత్తరప్రదేశ్‌లో తమిళం నేర్పిస్తారా?

                               - అన్బుమణి రాందాస్‌ ప్రశ్న


పెరంబూర్‌(చెన్నై): హిందీ నిర్బంధం దేశ సమైక్యతకు వ్యతిరేకంగా పరిణమిస్తోందని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ డా.అన్బుమణి రాందాస్‌ అభిప్రాయపడ్డారు. నగరంలో శనివారం ఆయన మాట్లాడుతూ, అందరూ హిందీ నేర్చుకోవాలని, అది దేశ సమైక్యతకు దారితీస్తుందని కేంద్రమంత్రి అమిత్‌షా తెలిపారని, కానీ, అది ప్రతికూల పరిస్థితులు సృష్టిస్తుందన్నారు. హిందీ నిర్బంధం చేయవద్దన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హిందీ, ఆంగ్ల భాషలున్నాయని, అక్కడ తమిళం నేర్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఏ భాషను నిర్బంధం చేయొద్దని, అది ఐక్యతకు బదులు విభేదాలు సృష్టిస్తుందన్నారు. అలాంటిది 1950-60లో చేసేందుకు యత్నించారని, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని అన్నారు.


Updated Date - 2022-04-17T15:30:25+05:30 IST