Shocking: 65 కొవిడ్ మరణాలను దాచిపెట్టిన ఆసుపత్రి

ABN , First Publish Date - 2021-05-18T00:11:23+05:30 IST

ఓ ప్రైవేటు ఆసుపత్రి 65 కొవిడ్ మరణాలను దాచిపెట్టింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గత 15 రోజులుగా కరోనా బారినపడి

Shocking: 65 కొవిడ్ మరణాలను దాచిపెట్టిన ఆసుపత్రి

డెహ్రాడూన్: హరిద్వార్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి 65 కొవిడ్ మరణాలను దాచిపెట్టింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గత 15 రోజులుగా కరోనా బారినపడి మృతి చెందిన 65 మంది వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టింది. గత నెల 25 నుంచి ఈ నెల 12 మధ్య బాబా బర్ఫానీ ఆసుపత్రిలో 65 మంది కరోనా రోగులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ వివరాలను డెహ్రాడూన్‌లోని రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూముతో పంచుకోవాల్సిన ఆసుపత్రి వాటిని పక్కకు తప్పించింది. 


విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి సుబోధ్ ఉనియాల్ మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా మృతుల లెక్కలు దాచిపెట్టిన ఆసుపత్రిపై విచారణ జరుపుతామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయాన్ని వెల్లడించినట్టు కొవిడ్ కంట్రోల్ రూము అధికారులు తెలిపారు. సిబ్బంది కొరత కారణంగానే ఈ లెక్కలు ప్రభుత్వంతో పంచుకోలేకపోయామని ఆసుపత్రి పేర్కొందని అధికారులు పేర్కొన్నారు. 


నిజానికి ఆసుపత్రులన్నీ రోగి మరణించిన 24 గంటల్లోపు ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని చీఫ్ ఆపరేటింగ్ అధికారి అభిషేక్ త్రిపాఠీ తెలిపారు. కాగా, కుంభమేళా తర్వాత ఉత్తరాఖండ్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.  

Updated Date - 2021-05-18T00:11:23+05:30 IST