కోచింగ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ బంద్

ABN , First Publish Date - 2021-04-16T21:54:02+05:30 IST

ఈ విషయమై కూడా అధికారులతో సీఎం తీరత్ సింగ్ ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజధాని డెహ్రడూన్‌లో జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కోచింగ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ బంద్

డెహ్రడూన్: కోవిడ్ ప్రభావం కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ని మూసివేయాలంటూ తీరత్ సింగ్ రావత్ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అనేక మంది కోవిడ్ సోకుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతే కాకుండా కోవిడ్ పరిస్థితిపై అధికారులతో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి తీరత్ సింగ్ సమావేశమై చర్చించనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎంవో పేర్కొంది. అయితే కోవిడ్ సమయంలో మహాకుంభమేలా నిర్వహించడంపై దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనల దృష్ట్యా.. ఈ విషయమై కూడా అధికారులతో సీఎం తీరత్ సింగ్ ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజధాని డెహ్రడూన్‌లో జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-04-16T21:54:02+05:30 IST