ఉత్తరాఖండ్ ఎన్నికలు : ముఖ్యమంత్రి ధామి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ వెనుకంజ

ABN , First Publish Date - 2022-03-10T17:09:18+05:30 IST

ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికల్లో అధికార బీజేపీ

ఉత్తరాఖండ్ ఎన్నికలు : ముఖ్యమంత్రి ధామి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ వెనుకంజ

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికల్లో అధికార బీజేపీ తన పీఠాన్ని పదిలపరచుకునే దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. 70 స్థానాలున్న శాసన సభలో 33 స్థానాల్లో బీజేపీ ముందంజలో కనిపిస్తోంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందంజలో ఉంది. కడపటి వార్తలు అందే సరికి ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామి దాదాపు900 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. 


నైనిటాల్ జిల్లాలోని, లాల్‌కౌన్ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ దాదాపు 7,000 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమ దసౌనీ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదన్నారు. సాయంత్రానికి కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా పుంజుకుంటుందని తెలిపారు. 


ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 


Updated Date - 2022-03-10T17:09:18+05:30 IST