Abn logo
May 28 2020 @ 03:47AM

డిసెంబర్‌ నెలాఖరుకు ‘వంశధార’ సిద్ధం

  • అధికారులకు ఉత్తరాంధ్ర సీఈ శివరాంప్రసాద్‌ ఆదేశం

హిరమండలం, మే27: హిరమండలం వద్ద చేపడుతున్న వంశధార రిజర్వాయర్‌ పనులను ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్‌ సీహెచ్‌ శివరాంప్రసాద్‌ అధికారులు, కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. బుధవారం రిజర్వాయర్‌, హైలెవల్‌ కెనాల్‌ పనులను పరిశీలించారు. పనులు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు 89 శాతం పనులు పూర్తయ్యాయని ఎస్‌ఈ రంగారావు తెలిపారు. బిల్లులు పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ ప్రతినిధి శ్రీనివాసరావు సీఈని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఈ కోరారు.  కార్యక్రమంలో వంశధార ఈఈ సుశీల్‌కుమార్‌, డీఈలు కె.బ్రహ్మానందం, కె.భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.