Abn logo
Apr 8 2020 @ 19:59PM

లాక్‌డౌన్‌పై ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం

డెహ్రూడూన్: ఈనెల 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగించాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకాభిప్రాయానికి వచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రి మదన్ కౌశిక్ మీడియాకు తెలిపారు. లాక్‌డౌన్‌ కొనసాగింపునకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపినట్టు చెప్పారు.


కాగా, లాక్‌డౌన్ పరిస్థితిపై బుధవారంనాడు పార్లమెంటు ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ మూడున్నర గంటల సేపు వీ డియో కాన్ఫరెన్స్‌ జరిపారు. ఇదే అంశంపై ఈనెల 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మాట్లాడనున్నారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement