మార్చ్ 25న యోగి ప్రమాణం

ABN , First Publish Date - 2022-03-19T03:14:51+05:30 IST

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణం చేయనున్నారు. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం

మార్చ్ 25న యోగి ప్రమాణం

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణం చేయనున్నారు. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. యోగి ప్రస్తుతం గోరఖ్‌పూర్ పర్యటనలో ఉన్నారు. గోరఖ్‌నాథ్ మందిరంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. లక్నోలోని ఇకానా స్టేడియంలో జరిగే యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. 45 వేల మంది సమక్షంలో ఈ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీయే నేతలు సహా మొత్తం 200 మంది వీవీఐపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరౌతారని తెలిసింది. ప్రమాణానికి హాజరవ్వాలంటూ సోనియా, రాహుల్, ప్రియాంక, ములాయం, అఖిలేష్, మాయావతికి కూడా ఆహ్వానం పంపినట్లు సమాచారం. 


మరోవైపు 65 ఏళ్లు దాటిన వారికి యోగి కేబినెట్‌లో ఈసారి మంత్రి పదవులు దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. యువతకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. జాట్, పటేల్ వర్గాల వారికి మంత్రి పదవులు ఖాయమని ప్రచారం జరుగుతోంది.     


ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను బీజేపీ సొంతంగా 255 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షాలైన అప్నాదళ్ 12, నిషాద్ పార్టీ 6 స్థానాల్లో గెలుపొందాయి. 



Updated Date - 2022-03-19T03:14:51+05:30 IST