Abn logo
Aug 15 2020 @ 11:20AM

కరోనా సంక్షోభ సమయంలోనూ కార్ల విక్రయాల జోరు

లక్నో (ఉత్తరప్రదేశ్): కరోనా సంక్షోభ సమయంలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కార్ల విక్రయాల జోరు కొనసాగింది. యూపీలో ఒక్క జులై నెలలోనే కొత్త కార్ల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి రూ.387.53 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త కార్ల రిజిస్ట్రేషన్ ఆదాయంలో యూపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని రవాణశాఖ కమిషనర్ ధీరజ్ సాహు చెప్పారు. జులై నెలలో 1,96,086 కార్లు,ద్విచక్రవాహనాలు, 5,442 కమర్షియల్ ట్రక్కులు, బస్సుల రిజిస్ట్రేషన్ జరిగింది. యూపీతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ కార్ల విక్రయాలు జోరుగా సాగాయి. కొత్త కార్ల రిజిస్ట్రేషన్ వల్ల మహారాష్ట్రాకు రూ.347.12కోట్లు, కర్ణాటకకు రూ.320.12కోట్లు, తమిళనాడుకు రూ.281.49కోట్లు, రాజస్థాన్ కు రూ.278.01 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా సంక్షోభంలోనూ ప్రజలు కొత్త కార్లు కొనేందుకు ముందుకు వస్తున్నారని తేలింది. కొత్త కార్లు, ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్ల వల్ల వచ్చిన ఆదాయం చూస్తే కరోనా ప్రభావం వీటి కొనుగోళ్లపై లేదని వెల్లడైంది. 

Advertisement
Advertisement
Advertisement