మూడంతస్తుల భవనం.. భార్య ఎక్కడుందా అని వెతికాడు.. మొదటి అంతస్తులో ఆమె చేసిన పనికి బిత్తరపోయిన భర్త..!

ABN , First Publish Date - 2021-10-27T18:17:40+05:30 IST

వారికి 18ఏళ్ల క్రితం..

మూడంతస్తుల భవనం.. భార్య ఎక్కడుందా అని వెతికాడు.. మొదటి అంతస్తులో ఆమె చేసిన పనికి బిత్తరపోయిన భర్త..!

ఇంటర్‌నెట్‌డెస్క్: వారికి 18ఏళ్ల క్రితం పెళైంది. ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త కష్టపడి బాగా సంపాదించాడు. అంతా సవ్యంగా ఉందనుకునే సమయంలో భార్య చేసిన పనికి భర్త షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


పవన్ కుమార్ దాస్, అంజు అనే దంపతులు స్థానిక పట్టణంలోని చితాయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్‌పుర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారికి 2003లో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు(ఒకరికి 16ఏళ్లు, మరొకరికి 14 ఏళ్లు) ఉన్నారు. పవన్ కుమార్‌కు లంక ప్రాంతంలో ఓ మెడికల్ షాపు ఉంది. అతనికి లంకలో మంచి పేరు ఉంది. బాగా కష్టపడి, మంచిగా సంపాదించి మూడంతస్తుల భవనాన్ని కట్టుకున్నాడు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో పవన్‌కు బుధవారం ఉదయం షాకింగ్ ఘటన ఎదురైంది.





పని పడడంతో షాపు నుంచి పవన్ కుమార్ ఇంటికి వెళ్లాడు. భార్య అంజు కోసం వెతకగా.. ఆమె కనిపించలేదు. ఆమె కోసం మొదటి అంతస్తుకు వెళ్లగా.. ఓ గదిలో ఆమెను చూసి కంగుతిన్నాడు. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా మనస్తాపానికి గురైన అంజు ఫ్యానుకు ఉరిపోసుకుని చనిపోయింది. ఆమెను అలా చూసేసరికి పవన్ గట్టిగా అరిచాడు. అతడి అరుపులు విని పక్కింటివాళ్లు అక్కడికి వచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆమె మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లి చనిపోవడంతో పిల్లలిద్దరూ తీవ్రంగా రోదించారు. వారి రోదనలు చూసి అక్కడికి వచ్చిన వారందరూ చలించిపోయారు. 


చితాయ్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఇంచార్జి మిర్జా రిజ్వాన్ బాగ్ మాట్లాడుతూ భార్యభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా అంజు ఆత్మహత్య చేసుకుందన్నారు. పవన్ కుమార్, అతని ఇద్దరు కుమారుల వాంగ్మూలాల ఆధారంగా కేసును నమోదు చేసుకున్నామన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం సమక్షంలో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్తను విచారిస్తున్నామన్నారు.

Updated Date - 2021-10-27T18:17:40+05:30 IST