‘జీవితాంతం నా కళ్లముందు మా అమ్మ ఉండాలంటే.. నేను ఇలా చేయక తప్పదు’ అంటూ ఆ 22ఏళ్ల కూతురు ఏం చేసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-09-29T18:01:35+05:30 IST

ఆ యువతికి ఇంకా పట్టుమని..

‘జీవితాంతం నా కళ్లముందు మా అమ్మ ఉండాలంటే.. నేను ఇలా చేయక తప్పదు’ అంటూ ఆ 22ఏళ్ల కూతురు ఏం చేసిందో తెలిస్తే..

మీరట్(ఉత్తర ప్రదేశ్): ఆ యువతికి ఇంకా పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. జీవితం అంటే ఏంటో కూడా తెలియదు. కానీ తల్లికోసం ఆ యువతి త్యాగం చేయాల్సి వచ్చింది. తల్లి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి తన జీవితాన్నే పణంగా పెట్టడానికొచ్చింది. ఏం జరిగిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..


ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందిన ఓ 48ఏళ్ల మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. భర్త ఓ ప్రైవేట్ టీచర్. భార్యను కాపాడుకోవడం కోసం తనకున్న పొలాన్ని అమ్మేశాడు. కిడ్నీ మార్పిడి చేస్తే గానీ ఆమె ఆరోగ్యం కుదుటపడదని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో భర్త తన కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చాడు. కానీ డాక్టర్లు అతడి కిడ్నీ కొన్ని కారణాల వల్ల సరిపోదని చెప్పారు. అప్పుడే వాళ్ల పెద్దకూతురు ముందుకొచ్చింది. ఆ యువతికి ఇంకా 22ఏళ్లే. తన తల్లికోసం కిడ్నీ దానం చేస్తానని చెప్పడంతో.. తండ్రి, బంధువులు వద్దని చెప్పారు. కానీ ఆ యువతి వినలేదు. 



ఆ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు. ఆ 22 ఏళ్ల అమ్మాయి మొదటి సంతానం. తల్లికి ఆరోగ్యం బాగోలేనప్పటినుంచీ తానే ఇంటిపనులు చూసుకుంటుంది. ‘‘పెద్ద కూతురు అంటే ఇంటిని చూసుకోవడమే కాదు.. పెద్ద కొడుకులా తల్లిని కాపాడుకునే బాధ్యత కూడా ఉంది’’అరి అంటోంది. ‘‘మా అమ్మను నేను జీవితాంతం నా కళ్ల ముందు చూసుకోవాలంటే.. నేను ఈ పని చేయాల్సిందే..’’అని చెప్పింది. కూతురి మాటలు విని తండ్రి కంటతడి పెట్టాడు. ఆ అమ్మాయిని పట్టుకోని తీవ్రంగా బాధపడ్డాడు. డాక్టర్లు కూడా ఓకే చెప్పడంతో.. ఆపరేషన్ చేశారు. సందీప్ గార్గ్ అనే డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ తల్లి, కూతరు క్షేమంగా ఉన్నారన్నారు. వాళ్ల ఫొటోలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని తల్లి, కూతురు ముందే మాట తీసుకున్నారని, అందుకే వారి ఫొటోలు బయటకు విడుదల చేయడం లేదన్నారు. కిడ్నీని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి గ్రీన్ కారిడార్ ద్వారా తరలించామన్నారు. ఇందుకు సహకరించిన పోలీసులకు ధన్యవాదములు తెలిపారు. ఆపరేషన్ చేయించుకున్న తల్లి ఇంకా 15ఏళ్లు బతికే అవకాశం వచ్చిందని, దీనంతటికీ కారణం ఆ 22 ఏళ్ల కూతురేనని ఆమెను మెచ్చుకున్నారు.

Updated Date - 2021-09-29T18:01:35+05:30 IST