కాన్పూర్ కాల్పులు: పోలీసు కుటుంబాలకు రూ. కోటి పరిహారం..

ABN , First Publish Date - 2020-07-04T00:44:48+05:30 IST

గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దూబేను పట్టునేందుకు వెళ్లి క్రిమినల్స్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది పోలీసుల కుటుంబాలకు...

కాన్పూర్ కాల్పులు: పోలీసు కుటుంబాలకు రూ. కోటి పరిహారం..

కాన్పూర్: గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దూబేను పట్టునేందుకు వెళ్లి క్రిమినల్స్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది పోలీసుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పెన్సన్‌తో పాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు.  ‘‘కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు క్రిమినల్స్ హతమయ్యారు. మా పోలీసు అమరుల త్యాగాలు వృధా కానివ్వం. వారి మరణాలకు కారకులైన వారిని వదిలిపెట్టం. మృతి చెందిన ఒక్కో పోలీసు కుటుంబానికి రూ. కోటి చొప్పున పరిహారం, పెన్సన్, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం..’’ అని సీఎం యోగి ప్రకటించారు. కాగా అంతకు ముందు ఆయన వికాస్ దూబే గ్యాంగ్ కాల్పుల్లో చనిపోయిన పోలీసులకు నివాళులర్పించేందుకు కాన్పూర్ వెళ్లారు. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మరోవైపు కాన్పూర్ కాల్పులపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. పోలీసుల ధైర్య సాహసాలను కొనియాడుతూ.. నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని పలువురు నేతలు కోరారు. 

Updated Date - 2020-07-04T00:44:48+05:30 IST