ఆ పెళ్లి కొడుక్కి ఎంత కష్టం వచ్చిందో..

ABN , First Publish Date - 2021-07-20T19:20:53+05:30 IST

ఉత్తరప్రదేశ్: జీవితంలో ఎవరైనా పెళ్లి రోజున ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు...

ఆ పెళ్లి కొడుక్కి ఎంత కష్టం వచ్చిందో..

ఉత్తరప్రదేశ్: జీవితంలో ఎవరైనా పెళ్లి రోజున ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఓ పెళ్లికొడుక్కి అనుకోని కష్టం ఎదురైంది. పెళ్లి రోజున భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతమంతా ముంపుకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులను పడవలో ఎక్కించి పెళ్లికొడుకే దానిని నెట్టుకుంటూ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇది ఎక్కడో బీహార్‌లోని మారుమూల గ్రామం అనుకుంటే పొరపాటే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా సమీపంలోని నదిలో వరద ప్రవాహం పెరగడంతో అఖాదఘాట్ సిటీ ప్రాంతం మునిగిపోయింది. దీంతో ప్రధాన రహదారికి చేరుకోడానికి స్థానికులు పడవలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పెళ్లికుమారుడు కూడా పడవలను నెట్టాల్సి వచ్చింది.

Updated Date - 2021-07-20T19:20:53+05:30 IST