తెలంగాణ బీజేపీ ఎంపీలు దద్దమ్మలు

ABN , First Publish Date - 2021-03-05T05:18:37+05:30 IST

తెలంగాణ బీజేపీ ఎంపీలు దద్దమ్మలు

తెలంగాణ బీజేపీ ఎంపీలు దద్దమ్మలు
సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నిరుద్యోగులను మోసగించిన ప్రభుత్వం

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

వర్ధన్నపేట, మార్చి 4 : తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకురావడం లో విఫలం కావడంతోపాటు పార్లమెంట్‌ సమావేశాల్లో ఏనాడు గళమెత్తలేని బీజేపీ ఎంపీలు పెద్ద దద్దమ్మలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఇల్లంద లక్ష్మీగార్డెన్స్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములునాయక్‌ పరిచ య కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి నియోజకవర్గ కో–ఆర్డినేట ర్‌ నమిండ్ల శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలం గాణకు రావాల్సిన కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్శిటీ, భువనగిరిలో ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌, రంగారె డ్డి జిల్లాలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర అంశాలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు గళమెత్తడంలో విఫలమయ్యారన్నారు. మతం పేరుతో ఓట్లు రాబట్టాలని చూస్తున్న బీజేపీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రతీ ఎన్నికల్లో నిరుద్యో గ సమస్యను పరిష్కరిస్తామని మభ్యపెట్టి ఓట్లను దండుకుని గద్దెనెక్కగానే తుం గలో తొక్కుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నిరుద్యోగ సమస్య రెట్టింపు అయిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షలకుపైగా నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగమని వారి ఇం ట్లో మాత్రం ఐదు ఉద్యోగాలు పొందారని సీఎం కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. ఇటీవల పే రివిజన్‌ కమిటీ రాష్ట్రంలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా యని లెక్కలు తేల్చాయన్నారు. రెండేళ్ల క్రితం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి రూ.3,016 నెలకు ఇస్తామని హామీఇచ్చారే తప్ప, నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతీ నిరుద్యోగికి రెండేళ్ల బకాయిలు రూ.72వేలు చెల్లించి ఓట్లను అడగాలని డిమాండ్‌ చేశారు. ఆరేళ్ల క్రితం గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేసీఆర్‌కు చెంచాగా వ్యవహరిస్తూ కాలేజీ నుంచి యూనివర్శిటీ వరకు ఎదిగి కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్నాడని ఆరోపించారు. కాకతీయ యూనివర్శిటీ, న్యాయస్థానాల్లో మేధావులను కలిసిన సందర్భంలో వారు కాంగ్రెస్‌ పార్టీకి సానుకూలంగా స్పందించడం శుభపరిణామమన్నారు. రాబోయే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌ మాట్లాడుతూ ప్రగతిభవన్‌లో పాలేరులా పనిచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తారా ? తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే నన్ను గెలిపిస్తారా ? అని అన్నారు. సమావేశంలో నాయకులు భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, కుసుమ కుమార్‌, పోడెం వీరయ్య, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, స్వర్ణ, దొమ్మాటి సాంబయ్య, పోశాల పద్మ, బండి సుధాకర్‌, మార్నేని వెంకటేశ్వర్‌రావు, బొంపెల్లి దేవేందర్‌రావు, వెంకట్రాంనర్సింహారెడ్డి, ఎద్దు సత్యనారాయణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T05:18:37+05:30 IST