హైదరాబాద్: తెలంగాణలో 5వ విడతల పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి ముందే పాత బిల్లులు విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy)ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కు లేఖ రాశారు. బిల్లలు రాకపోవడం వల్ల పంచాయితీలు, ఆయా పనులు నిర్వహించిన ఎంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు.వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు.పంచాయతీలపై వేతనభారం పడకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఇవి కూడా చదవండి