రాహుల్‌ను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు: Uttam
ABN , First Publish Date - 2022-06-21T19:31:20+05:30 IST
కావాలనే కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఈడీ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని
ఢిల్లీ : కావాలనే కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఈడీ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam kumar Reddy) ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు బీజేపీ(BJP) దిగుతోందన్నారు. ఏ మాత్రం కూడా కాంగ్రెస్ నేతలు ఇలాంటి బెదిరింపులకు భయపడరని ఆయన పేర్కొన్నారు. ఇటీవల దేశంలో ఉత్పన్నమైన కోవిడ్ పెద్ద నోట్ల రద్దు(Demonitisation) అంశాలన్నీ రాహుల్ గాంధీ లేవనెత్తారని గుర్తు చేశారు. బీజేపీ చేష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎంపీ ఉత్తమ్ విమర్శించారు.