ఉత్సాహంగా జెండా పండుగ

ABN , First Publish Date - 2022-08-13T05:51:37+05:30 IST

ఉత్సాహంగా జెండా పండుగ

ఉత్సాహంగా జెండా పండుగ
నున్నలోహర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

  వాడవాడలా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ 

  ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణ

విజయవాడ రూరల్‌, ఆగస్టు 12 : గన్నవరం మండలం కొండపావులూరులోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ ఆధ్వర్యంలో నున్నలో హర్‌ ఘర్‌ తిరం గా ర్యాలీ శుక్రవారం జరిగింది. సుమారు 450 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు, జవాన్లతోపాటు నున్న జడ్పీ హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సుమారు 300 మంది విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని స్థానిక మదర్‌ థెరిస్సా నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ వద్ద కమాండెంట్‌ జహీద్‌ ఖాన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కె సువర్ణరాజు, నున్న సర్పంచ్‌ కె సరళ, రామవరప్పాడు సర్పంచ్‌ వీ శ్రీదేవి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి,  బొంతు సరోజిని, దూరు రత్నం,  పోలారెడ్డి చంద్రారెడ్డి  పాల్గొన్నారు.  

గన్నవరం : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగా లను స్ఫూర్తిగా తీసుకోవాలని సీఐ కె.శివాజీ,  హెచ్‌ ఎం దాసరి మాధవీలత అన్నారు. స్థానిక మల్లికార్జున హైస్కూల్‌ విద్యార్ధులు వంద మీటర్ల జాతీయ జెండా తో పట్టణంలో శుక్రవారం ప్రదర్శన చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పలు పాఠశా లలు, కళాశాలల విద్యార్ధులు, సీఆర్‌పీ ఎఫ్‌ జవాన్లు  జాతీయ జెండాలతో ప్రదర్శన చేశారు. సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో కమాండెంట్‌ కెపి పాండ, అల్లాపురం సర్పంచ్‌ డొక్కు సాంబశివ వెంకన్నబాబు, ఉప సర్పంచ్‌ ఆవుటపల్లి శివప్రసాద్‌ పాల్గొన్నారు. 

ఉంగుటూరు  : జాతీయ నాయకుల త్యాగస్ఫూర్తిని నేటితరానికి గుర్తుచేస్తూ ప్రతిఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని వెల్దిపాడు సర్పంచ్‌ లాం నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. శుక్రవారం వెల్దిపాడులో సర్పంచ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ర్యాలీలో ఎంపీయూపీ, జడ్పీహైస్కూల్‌ హెచ్‌ఎం లు శ్రీనివాస్‌, ఎన్‌, ఉషా, ఉపాధ్యాయులు, సచివాలయసిబ్బంది, వలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెదఅవుటపల్లిలో గణేష్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సెయింట్‌జార్జి ఆర్సీఎం హైస్కూల్‌లో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో విద్యార్ధుల ప్రదర్శన ఆందరినీ ఆకట్టుకుంది.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : రంగన్నగూడెం, వేలేరు హైస్కూల్‌లో ఆజాదీ కా అమృత్‌ మహో త్సవ్‌లో భాగంగా శుక్రవారం ర్యాలీ, క్రీడాపోటీలు నిర్వహించారు. రంగన్నగూడెంలో ఎంపీయూపీ స్కూల్‌ విద్యార్ధులు హెచ్‌ఎం జి.రాణి, పీఎంసీ చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ పర్యవేక్షణలో సర్పంచ్‌ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యుడు పుసులూరి లక్ష్మీ నారాయణ, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు కసుకుర్తి శ్రీనివాసరావులతో కలిసి జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.  వేలేరు హైస్కూల్‌ విద్యార్ధులకు పీడీ టాన్యాగిరి పర్యవేక్షణలో కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ఆరుగొలనులో సర్పంచ్‌ మూల్పూరి శ్రీలక్ష్మి, వేలేరులో సర్పంచ్‌ సొది మెళ్ల సుందరమ్మ, వీరవల్లిలో  సర్పంచ్‌ పిల్లా అనిత ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌ ర్యాలీలో పాల్గొన్నారు. 

వణుకూరు (కంకిపాడు) : మండలంలోని వివిధ గ్రామాల్లో గల జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠ శాలల్లో హర్‌ ఘర్‌ తిరంగ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కంకిపాడు మండలంలోని నెప్పల్లి, పెనమలూరు మండలంలోని వణుకూరు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రం - 4లో శుక్రవారం హర ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వణుకూరు సర్పంచ్‌ విజయ  స్వాతం త్య్ర సమరయోధుల త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మయ్య, వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు.

ఉయ్యూరు : స్థానిక జూనియర్‌ సివిల్‌  జడ్జి కోర్టు వద్ద ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.బేబీరాణి పాల్గొని జాతీయ పతాకాన్ని  ఆవిష్కరించారు. అనంతరం  బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, ఎస్సైలు వీరప్రసాద్‌, రమేశ్‌,  పోలీసులతో కలసి ర్యాలీలో పాల్గొన్నారు. ఉయ్యూరు ఇంగ్లీషు మీడియం స్కూల్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ సారథి, ఉయ్యూరు చైర్మన్‌ సత్యనారాయణ పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు దేశభక్తి గేయాలు ఆలపించారు. స్కూల్‌ డైరెక్టర్‌ ఎంకె బాబు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-13T05:51:37+05:30 IST