ప్రభోత్సవం

ABN , First Publish Date - 2021-04-13T05:06:58+05:30 IST

శ్రీగిరిపై ఉగాది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి

ప్రభోత్సవం

  1. శ్రీశైలంలో ఉగాది వేడుకలు


శ్రీశైలం, ఏప్రిల్‌ 12: శ్రీగిరిపై ఉగాది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచేగాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కన్నడ భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైలం పులకించింది. శ్రీశైల వీధులు భక్తులతో నిండిపోయాయి. సోమవారం క్షేత్ర మాడవీధుల్లో అశేష భక్తజనం మధ్య స్వామి, అమ్మవార్ల ప్రభోత్సవం వైభవంగా జరిగింది. రఽథోత్సవానికి ముందురోజు ప్రభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు మహాసరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. శివదీక్షా శిబిరాల వద్ద భక్తుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు జరిపారు. కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్ర వచనాలను పఠిస్తూ శూలాలు, అస్ర్తాలను తమ చెంపల్లోకి, నాలుకలలోకి, పెదవులలోకి, కడుపులోకి, చేతులకు గుచ్చుకున్నారు. తరువాత నిప్పులపై నడిచారు. ఉగాది రోజు మంగళవారం పంచాంగ శ్రవణం, రథోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారు రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తారు. 

Updated Date - 2021-04-13T05:06:58+05:30 IST