రైల్వే జనరల్‌ టెకెట్ల బుకింగ్‌ కోసం అందుబాటులోకి యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌

ABN , First Publish Date - 2021-02-26T08:12:56+05:30 IST

ప్యాసింజర్‌ రైళ్లలో అన్‌రిజర్వు డు టికెట్ల విక్రయానికి రైల్వే శాఖ మళ్లీ ‘యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌’ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని జోన్లలో ఈ యాప్‌ను ప్రయాణికులకు అం దుబాటులోకి తేవాలంటూ

రైల్వే జనరల్‌ టెకెట్ల బుకింగ్‌ కోసం అందుబాటులోకి యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్యాసింజర్‌ రైళ్లలో అన్‌రిజర్వు డు టికెట్ల విక్రయానికి రైల్వే శాఖ మళ్లీ ‘యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌’ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని జోన్లలో ఈ యాప్‌ను ప్రయాణికులకు అం దుబాటులోకి తేవాలంటూ భారతీయ రైల్వే ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కూడా ఈ మొబైల్‌ యాప్‌ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొవిడ్‌కు ముందు నడిచిన అన్ని రకాల ఎక్స్‌ప్రెస్‌, ప్యాసెంజర్‌, సబ్‌-అర్బన్‌ (ఎంఎంటీఎస్‌), ఇంటర్‌ సిటీ రైళ్లలో ‘అన్‌రిజర్వుడు టికెట్‌ సిస్టం (యూటీఎస్‌)’ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో ఉండేది. కొవిడ్‌ నేపథ్యంలో.. రైల్వేశాఖ ఈ యాప్‌ను డీయాక్టివేట్‌ చేసింది. త్వరలో ఎంఎంటీఎస్‌ రైళ్లతో పాటు మరో 22 రైళ్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో అడ్వాన్స్‌ బుకింగ్‌తో పాటు కౌంటర్‌ బుకింగ్‌, మొబైల్‌ యాప్‌ బుకింగ్‌ సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. ఎంఎంటీఎస్‌ రైళ్లన్నీ కౌంటర్‌ బుకింగ్‌ రైళ్లే. వీటిలో యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ బుకింగ్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈమేరకు యాప్‌ను యాక్టివేట్‌ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. ఈ యాప్‌ ద్వారా టికెట్‌ను బుక్‌ చేసుకుని ప్రయాణించవచ్చు. దీంతో.. కౌంటర్ల వద్ద జనం రద్దీ పెద్దగా ఉండదని రైల్వే శాఖ భావిస్తోంది. 

Updated Date - 2021-02-26T08:12:56+05:30 IST