స్విమ్మింగ్‌ పూల్‌ సేవలు వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-05-24T06:06:14+05:30 IST

స్విమ్మింగ్‌ పూల్‌ సేవలను పట్టణ ప్రజలే కాకుండా, జిల్లాలోని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని ఎ మ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

స్విమ్మింగ్‌ పూల్‌ సేవలు వినియోగించుకోవాలి
స్విమ్మింగ్‌ పూల్‌ను ప్రారంభిస్తున్న అతిథులు

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 

జగిత్యాల అర్బన్‌, మే 23: స్విమ్మింగ్‌ పూల్‌ సేవలను పట్టణ ప్రజలే కాకుండా, జిల్లాలోని ప్రజలు అందరూ  వినియోగించుకోవాలని  ఎ మ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్ధానిక వివేకానంద మినీ స్టేడి యంలో గల యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌ పూల్‌ను జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత, కలెక్టర్‌ రవి, బల్దియా ఛైర్‌పర్సన్‌ శ్రావణి చేతుల మీదుగా ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ క్రీడా మైదానం చూస్తే తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయన్నారు. ఫుట్‌బాల్‌, హాకీకి ఒకనాడు జగిత్యాల పట్టణంలో మంచి క్రే జ్‌ ఉండేదన్నారు. ప్రస్తుత దైనందిక జీవనంలో  పిల్లలకు ఆటలు దూరమయ్యే ప్రమాదం ఉన్నం దున పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలు ఉండేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ సూచించారన్నారు.   కలెక్టర్‌ రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వం సీఎం కేసీఆర్‌ క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ మనిషి ఏరంగంలో రాణించాల న్నా మెంటల్‌గా, ఫిజికల్‌గా స్టెబిలిటీ కావాలని, అది కేవలం క్రీడల ద్వారా సాధ్యం అవుతుం దన్నారు. బల్దియా ఛైర్‌పర్సన్‌ శ్రావణి మాట్లాడు తూ పట్టణ ప్రజలకు స్విమ్మింగ్‌ పూల్‌ సేవలు ఒక సువర్ణావకాశమని, ప్రజలు ఈ సేవలను వి నియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జి ల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి డాక్టర్‌ భో నగిరి నరేష్‌, కమిషనర్‌ స్వరూపారాణి, డీఈ రాజేశ్వర్‌, జిల్లా బాలల సంక్షేమ అధికారి  హరీ ష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T06:06:14+05:30 IST