సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-17T04:07:32+05:30 IST

ప్రభుత్వం నిరుపేద మహిళ లకు అందజేస్తున్న సబ్సిడీగ్యాస్‌ సిలిండర్లను సద్విని యోగం చేసుకోవాలని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.

సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత సబ్సిడీ గ్యాస్‌లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోనప్ప

- సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

సిర్పూరు(టి), మే 16: ప్రభుత్వం నిరుపేద మహిళ లకు అందజేస్తున్న సబ్సిడీగ్యాస్‌ సిలిండర్లను సద్విని యోగం చేసుకోవాలని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం మండల కేంద్రంలో హెచ్‌పీ గ్యాస్‌డీలర్‌ కార్యాలయంలో ఉజ్వలగ్యాస్‌ సిలిండర్లను ఆయన పంపిణీ చేశారు. అలాగే కోనేరు చారిటబుల్‌ ట్రస్టు నుంచి ప్రతి ఒక్కరికీ ఒక చీరెను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీగ్యాస్‌ను అందజేస్తోం దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్‌ సద్ధాం హుస్సేన్‌, సిర్పూరు(టి) ఎంపీపీ సువర్ణ, సర్పంచి పర్వీన్‌, కోఆప్షన్‌సభ్యుడు కీజర్‌హుస్సేన్‌,  హెచ్‌పీ గ్యాస్‌ డీలర్‌ మహ్మద్‌ కుర్షీద్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

సత్రంలో ప్రత్యేక పూజలు

కాగజ్‌నగర్‌: బుద్ధజయంతిని పురస్కరించు కొని కాగజ్‌నగర్‌ పట్టణంలోని బస్టాండు సమీపంలో ఉన్న నిత్యాన్నదాన సత్రంలో బుద్ధుడి విగ్రహం వద్ద బంతెజీ బౌద్ధ గురు ధర్మరక్షిత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా అన్నదానం చేపడుతున్న తీరును ఎమ్మెల్యే కోనప్ప, సతీమణి రమాదేవి బౌద్ధ గురువులకు వివరించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు.

Updated Date - 2022-05-17T04:07:32+05:30 IST