ఊటీకి Special Train

ABN , First Publish Date - 2022-05-21T18:18:29+05:30 IST

పర్యాటకుల సంఖ్య పెరగడంతో ఊటీకి ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. మేట్టుపాళయం-ఊటీ మధ్య నెం.06171 ప్రత్యేక రైలు శనివారాల్లో ఉదయం 9 గంటలకు

ఊటీకి Special Train

ఐసిఎఫ్‌(చెన్నై): పర్యాటకుల సంఖ్య పెరగడంతో ఊటీకి ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. మేట్టుపాళయం-ఊటీ మధ్య నెం.06171 ప్రత్యేక రైలు శనివారాల్లో ఉదయం 9 గంటలకు మేట్టుపాళయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు ఊటీ చేరుకుంటుంది. ఈ రైలు శనివారం నుంచి జూలై 16వ తేదీ వరకు నడుపనున్నారు. ఇదే విధంగా మరో మార్గంలో ఊటీ-మేట్టుపాళయం నెం.06172 ప్రత్యేక రైలు శుక్రవారాల్లో ఉదయం 11.25 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.20 గంటలకు మేట్టుపాళయం చేరుకుంటుంది. ఈ రైళ్లను ఈ నెల 27 నుంచి జూలై 22వ తేదీ వరకు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Updated Date - 2022-05-21T18:18:29+05:30 IST