అక్తర్ నాకు వార్నింగ్ ఇచ్చాడు: ఉతప్ప

ABN , First Publish Date - 2021-05-17T22:05:09+05:30 IST

క్రీజు దాటి బయటికొచ్చి ఆడితే భయంకర బౌన్సర్ విసురుతానని పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ అక్తర్ గతంలో ఒకసారి వార్నింగ్ ఇచ్చాడని టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప గుర్తు చేసుకున్నాడు

అక్తర్ నాకు వార్నింగ్ ఇచ్చాడు: ఉతప్ప

క్రీజు దాటి బయటికొచ్చి ఆడితే భయంకర బౌన్సర్ విసురుతానని పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ అక్తర్ గతంలో ఒకసారి వార్నింగ్ ఇచ్చాడని టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప గుర్తు చేసుకున్నాడు. 2007లో పాక్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ఆ సిరీస్‌లో గువాహటి వన్డే తర్వాత జరిగిన డిన్నర్ సమయంలో అక్తర్ తనతో మాట్లాడాడని చెప్పాడు. 


`గువాహటిలో జరిగిన వన్డేలో నేను క్రీజులో ఉన్న సమయానికి 25 బంతుల్లో 12 పరుగులు కావాలి. ఇర్ఫాన్, నేను క్రీజులో ఉన్నాం. ఆ సమయంలో అక్తర్ నాకు 154 కి.మీ. వేగంతో ఓ యార్కర్ విసిరాడు. దానిని నేను ఆపాను. ఆ తర్వాత బంతి లో-ఫుల్ టాస్. దానిని బౌండరీకి పంపాను. అక్తర్ వరుసగా యార్కర్లు వేస్తున్నాడు. క్రీజు దాటి ఫ్రంట్ ఫుట్‌లో ఆడాలని అనుకున్నా. అక్తర్ బౌలింగ్‌లో అలా ఆడే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. అక్తర్ వేసిన బంతికి క్రీజు బయటికొచ్చి నా బ్యాట్‌ను తాకించా. అది బౌండరీకి వెళ్లడంతో మేం గెలిచాం. 


ఆ తర్వాత నాలుగో వన్డేకు ముందు జరిగిన డిన్నర్ కార్యక్రమంలో షోయబ్ నా దగ్గరకు వచ్చాడు. `గువాహటి వన్డేలో బాగా ఆడావు. నా బౌలింగ్‌లో క్రీజు దాటి బయటకు వచ్చి ఆడావు. ఇంకోసారి అలా చేయకు. నీ తలకు గురిపెడుతూ ఓ భయంకరమైన బౌన్సర్ రావొచ్చ`ని హెచ్చరించాడు. దాంతో నేను భయపడ్డాన`ని ఉతప్ప చెప్పాడు. 

Updated Date - 2021-05-17T22:05:09+05:30 IST