పీఆర్‌సీపై యూటీఎఫ్‌ వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-01-17T04:59:30+05:30 IST

సీఎం ప్రకటించిన పీఆర్‌సీని వ్యతిరేకి స్తూ ఆదివారం యూ టీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయు లు ఒంటికాలిపై నిలబ డి, చెవిలో పూలతో వినూ త్న నిరసన తెలియజే శారు.

పీఆర్‌సీపై యూటీఎఫ్‌ వినూత్న నిరసన
ఒంటికాలిపై నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

బద్వేలు, జనవరి 16: సీఎం ప్రకటించిన పీఆర్‌సీని వ్యతిరేకి స్తూ ఆదివారం  యూ టీఎఫ్‌ ఆధ్వర్యంలో   ఉద్యోగ, ఉపాధ్యాయు లు  ఒంటికాలిపై నిలబ డి, చెవిలో పూలతో వినూ త్న నిరసన తెలియజే శారు. ఈ సందర్భంగా  యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుప డతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం నేడు రివర్స్‌ పీఆర్‌సీ ప్రకటించడం బాధాకరమన్నారు.  ప్రభుత్వవైఖరిలో మార్పు రాకపోతే  ఈ నెల 20న కలెక్ట రేట్లను ముట్టడిస్తామని,  28న చలో విజయవాడ కార్యక్ర మం  చేపడతామన్నారు. యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు శివప్రసాద్‌,  వీర దాసరి క్రిష్టఫర్‌, జిల్లాకౌన్సిలర్లు శ్రీనివాసులరెడ్డి, చక్రపాణి, చంద్రశేఖర్‌ యాద వ్‌, విజయభా స్కర్‌, మస్తాన్‌వలి, చెన్నయ్య, నర సింహులు, లాజరయ్య, సుబ్రమణ్యం, గురవయ్య పాల్గొన్నారు.

సీపీఎ్‌సను వెంటనే రద్దు చేయాలి

పోరుమామిళ్ల, జనవరి 16 : సీపీఎ్‌సను వెంటనే రద్దు చే యాలని అసుతో్‌షమిశ్రా కమిటీ రిపోర్టును బహిర్గత పరచాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి అన్నారు. ఆదివారం   ఎంఈవో కార్యాలయం ఆవరణ లో ఫ్యాప్టో  సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిట్మెంట్‌ పై పునరాలోచించి ఐఆర్‌ 27 శాతం కన్నా అధికంగా ఇవ్వాలన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి పాత పద్దతిలోనే పీఆర్‌సీ కొనసాగించాలన్నారు. సచివాయల ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌  చేయాలన్నారు. కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా రెగ్యులర్‌ చేయాలని ఈ సమస్యల సాధనకై ఈ నెల 25న కడప కలెక్టరేట్‌ కార్యాలయ ముట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా అన్ని సంఘాలు సమీష్టి కృషితో పని చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రాష్ట్ర కన్వీనర్లు బాలరాజు, పుల్లయ్య పాల్గొన్నారు.



Updated Date - 2022-01-17T04:59:30+05:30 IST