ఘనంగా యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2022-08-11T05:31:49+05:30 IST

యూటీఎఫ్‌ మండలశాఖ ఆధ్వర్యంలో మేడ పాడు ప్రధాన కూడలి వద్ద ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం
యలమంచిలి మండలం మేడపాడులో పతాకావిష్కరణ

యలమంచిలి, ఆగస్టు 10: యూటీఎఫ్‌ మండలశాఖ ఆధ్వర్యంలో మేడ పాడు ప్రధాన కూడలి వద్ద ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఈడీవీ.ప్రసాద్‌ జాతీయ జెండా, రాష్ట్ర మాజీ కార్యదర్శి సరిపల్లి జయప్రభ యూటీఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. మండల ప్రధాన కార్యదర్శి పి.క్రాంతికుమార్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల కోసం యూటీఎఫ్‌ నిరంతరం పనిచేస్తోందన్నారు. పాఠశాలల విలీనం, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను వ్యతిరేకిస్తూ సాగిస్తున్న పోరాటాన్ని ఉధృతం చేయాలన్నారు. గుత్తిందీవి శ్రీనివాసరావు, వర్థనపు సందీప్‌, దేవ సుధాకర్‌, పి.రామ్మూర్తినాయుడు, ఎస్‌.లక్ష్మి, పి.బుద్ధరాజు పాల్గొన్నారు.


వీరవాసరం: విద్యారంగం పరిరక్షణకు యూటీఎఫ్‌ కృషి చేస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామభద్రం అన్నారు. యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు పి.హరికృష్ణ, యూటీఎఫ్‌ పతాకాన్ని ఏకేవీ.రామభద్రం ఎగురవేశారు. అమరవీరుల ఆశయాల సాధనకై కృషి చేయాలన్నారు. సీనియర్‌ నాయకులు జీవీ వీ.రామానుజారావు, మండల అధ్యక్షుడు కె.నాగమునేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎంఎస్‌సిహెచ్‌ శ్రీనివాసరావు, ఎం.దుర్గారావు, జీవీ.రమణ, వై శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, దుర్గారావు, పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:31:49+05:30 IST