ఉపాధ్యాయులకు యూటీఎఫ్‌ అండ

ABN , First Publish Date - 2022-08-11T04:28:58+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసేందుకు నిరంతరం యూటీఎఫ్‌ శ్రమిస్తుందని ప్రతినిధులు అన్నారు. బుధవారం స్థానిక ప్రాంతీయ కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ 49వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సీనియర్‌ నాయకులు గవిని నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేయగా మరో సీనియర్‌ నాయకులు విజయవర్ధనరాజు యూటీఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఉపాధ్యాయులకు యూటీఎఫ్‌ అండ
జెండా వందనం చేస్తున్న యూటీఎఫ్‌ ప్రతినిధులు

చీరాలటౌన్‌, ఆగస్టు 10 : ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసేందుకు నిరంతరం యూటీఎఫ్‌ శ్రమిస్తుందని ప్రతినిధులు అన్నారు. బుధవారం స్థానిక ప్రాంతీయ కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ 49వ ఆవిర్భావ  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సీనియర్‌ నాయకులు గవిని నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేయగా మరో సీనియర్‌ నాయకులు విజయవర్ధనరాజు యూటీఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించి హక్కుల సాధనకై ఉద్యమిస్తున్న సంఘం యూటీఎఫ్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్‌ జానీబాషా, జి.సూరిబాబు, మురళి, కుర్రా శ్రీనివాసరావు, ఎస్వీ సుబ్బారెడ్డి, ఎన్‌.రాజే్‌ష, మాశెట్టి శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

హక్కులు, బాధ్యతలు ఉపాధ్యాయులకు రెండు కళ్లు

కారంచేడు(పర్చూరు) : హక్కులు, బాధ్యతలు ఉపాధ్యాయులకు రెండు కళ్లుగా ఉంటాయని యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ భవనం శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. బుధవారం కారంచేడు కాలువ సెంటర్‌లో యూటీఎఫ్‌ మండలశాఖ ఆధ్వర్యంలో 49వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాతోపాటు, యూటీఎఫ్‌ జెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు రావి పద్మావతి, పి.నాగమణి, కోశాధికారి ప్రమీలా రాజేష్‌, కార్యవర్గ సభ్యులు భవానీ ప్రసాద్‌, రమే్‌షరెడ్డి, ప్రసాద్‌, మురళి, పావులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T04:28:58+05:30 IST