Abn logo
Nov 24 2020 @ 23:30PM

టీచర్లు పనిలేకుండా జీతాలు తీసుకుంటున్నారా.. ?

 డీఈవో సహా ఉన్నతాధికారుల 

వ్యాఖ్యలపై యూటీఎఫ్‌ ఆగ్రహం

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 24:ఈ ఏడాది మార్చి నుంచి టీచర్లు పని లేకుండా ఉంటున్నారని, ఇంట్లోనే కూర్చొని జీతాలు తీసుకుంటున్నారంటూ విద్యాశాఖ డైరెక్టర్‌ వ్యాఖ్యలు చేసినట్టు డీఈవో సీవీ రేణుక వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని యూటీ ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, బి.గోపీ మూర్తి తెలిపారు. డీఈవో మంగళవారం నిర్వహించిన ఎంఈవోల టెలీకాన్ఫరెన్సులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నారు. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల అన్ని ప్రభుత్వ కార్యాల యాలు మూతపడ్డాయని విషయం విద్యాధి కారులకు తెలియదా అని ప్రశ్నించారు.నాడు–నేడు నిర్మాణ పనులు, విద్యాకానుక కిట్ల పంపిణీని అమలు చేశారన్నారు. టీచర్లు ఏపని చేయలేదో డీఈ వోతో సహా ఉన్నతాధికారులు చెబితే బాగుంటుందని, అభ్యం తరకర వ్యాఖ్యలను తక్షణమే ఉపసహరించుకోవాలన్నారు.


Advertisement
Advertisement
Advertisement