ఉత్తరాఖండ్‌ మొదటి మహిళా సీఎంగా రీతూ ఖండూరి?

ABN , First Publish Date - 2022-03-14T08:02:01+05:30 IST

ఉత్తరాఖండ్‌ మొట్టమొదటి మహిళా సీఎంగా అసెంబ్లీ ఎన్నికల్లో కోట్‌ద్వార్‌ నియోజకవర్గం నుంచి విజయం..

ఉత్తరాఖండ్‌ మొదటి మహిళా  సీఎంగా రీతూ ఖండూరి?


 నామినేట్‌ చేయనున్న మోదీ!

డెహ్రాడూన్‌, మార్చి 13: ఉత్తరాఖండ్‌ మొట్టమొదటి మహిళా సీఎంగా అసెంబ్లీ ఎన్నికల్లో కోట్‌ద్వార్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రీతూ ఖండూరి.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయా? అంటే అవునని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని మోదీ ఆమెను నామినేట్‌ చేసే అవకాశం ఉందన్నాయి. దీనిపై ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సమావేశానికి రీతూను పిలవడంతో ఇక ఉత్తరాఖండ్‌ సీఎంగా ఆమెనే ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. తాజా ఎన్నికల్లో బీజేపీకి ఆ రాష్ట్ర మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. దీంతో సీఎంగా మహిళా అభ్యర్థిని నియమించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రీతూ ఖండూరి పేరు తెరపైకి వచ్చింది. అలాగే రీతూ భర్త రాజేశ్‌ భూషణ్‌కు ప్రధాని మోదీతో సత్సంబంధాలు ఉన్నాయి. భూషణ్‌ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖలో సీనియర్‌ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన తన పనితీరుతో మోదీతో పాటు యావత్‌ క్యాబినెట్‌ నుంచీ ప్రశంసలు పొందారు. కాగా ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తే రీతూ ఖండూరి.

దీపిక రాజీనామా

 ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ కో-ఇన్‌చార్జి, జాతీయ కార్యదర్శి  దీపికా పాండే సింగ్‌ తన పదవులకు రాజీనామా చేశారు. 

Updated Date - 2022-03-14T08:02:01+05:30 IST