క్రిస్మస్‌ రోజున కన్న బిడ్డలతో గడుపుతా అని ఖైదీ వేడుకున్నా కుదరదన్న జడ్జి.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-12-26T02:58:48+05:30 IST

కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి చేసిన అభ్యర్థనను యూటా రాష్ట్రంలోని(అమెరికా) న్యాయస్థానం తిరస్కరించింది.

క్రిస్మస్‌ రోజున కన్న బిడ్డలతో గడుపుతా అని ఖైదీ వేడుకున్నా కుదరదన్న జడ్జి.. కారణమేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి చేసిన అభ్యర్థనను యూటా రాష్ట్రంలోని(అమెరికా) న్యాయస్థానం తిరస్కరించింది. క్రిస్మస్ రోజున తన కన్నబిడ్డలతో గడుపుతానని నిందితుడు బ్రెంట్ బ్రౌన్ కోరగా.. కోర్టు అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. 19 ఏళ్ల యువతి మేడలిన్ ఎల్లెన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో బ్రెంట్ బ్రౌన్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఇంటి సెల్లార్‌లో ఆపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-12-26T02:58:48+05:30 IST